Delhi Encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో హషీమ్ బాబా ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈశాన్య ఢిల్లీలోని అంబేడ్కర్ కాలేజీ సమీపంలో సోమవారం రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల గురించి పోలీసులకు సోమవారం సమాచారం అందింది. పోలీసులు వారిని పట్టుకోవడానికి వెళ్లగా.. గ్యాంగ్‌స్టర్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యుల కాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు వారిని పట్టుకొని ఆస్పత్రికి తరలించారు.
Also Read
Also Read: Anushka Shetty: సన్నబడిన అనుష్క శెట్టి.. స్లిమ్ లుక్ పిక్ వైరల్!
గాయపడిన దుండగులను అలీ అలియాస్ ఫహాద్, ఆసిఫ్ అలియాస్ ఖలీద్, అల్సెజాన్ అలియాస్ థోథాగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మూడు రోజుల క్రితం శీలంపూర్‌లో జరిగిన ఘటనలో అర్బాజ్ చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. గ్యాంగ్‌స్టర్లు కోలుకున్నాక విచారణ చేపట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!