Anushka Shetty Joins the sets of Malayalam Movie Kathanar: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి చివరగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంట అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం అనుష్క మరో సినిమా చేయలేదు. అంతేకాదు అప్పటినుంచి ఒక్కసారి బయటకు కూడా రాలేదు. దాంతో అనుష్క ఏం చేస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఓ మలాయళ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొన్నారు.
రోజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’. ఈ మలయాళ సినిమా సోమవారం సెట్స్‌పైకి వెళ్లింది. కథనార్ సినిమా షూటింగ్‌లో అనుష్క శెట్టి పాల్గొన్నారు. అనుష్క చిత్ర బృందంతో కలిసి ఉన్న ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఇందులో అనుష్క స్లిమ్ లుక్‌లో ఉన్నారు. ఆమె చాలా సన్నబడ్డారు. అనుష్క లేటెస్ట్ ఫొటోస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనుష్కఇన్నాళ్లు వర్కౌట్స్ చేసిందని ఇట్టే అర్ధమవుతోంది.
Also Read: Realme Narzo 70 Pro 5G Price: మార్చి 19న మార్కెట్‌లోకి రియల్‌మీ నార్జో 70 ప్రో.. ధర, ఫీచర్లివే!
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ముందే కథనార్ చిత్రం చేయడానికి అనుష్క శెట్టి ఒప్పుకున్నారు. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది. కథనార్ చిత్రంలో అనుష్క నెగిటివ్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాహుల్ సుబ్రమణియన్ సంగీత దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేయనుందని సమాచారం. క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క నటించిన విషయం తెలిసిందే.