Delhi: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఓ అవమానకర ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల కానిస్టేబుల్ కి ఇన్‌స్టాలో ఒక సందేశం వచ్చింది. పంపిన వ్యక్తి ఆమె కారు నంబర్, మొబైల్ నంబర్‌ను సైతం మెసేజ్ ద్వారా తెలియజేశాడు. అంటే కాకుండా “నువ్వు చాలా అందంగా ఉన్నావు. మనం స్నేహితులుగా ఉండగలమా?” అని సందేశం పంపాడు. దీంతో ఆమె మెసేజ్ చేసిన వ్యక్తిని మందలించింది. సైబర్ క్రైమ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఆసక్తికరమైన విషయం తెలిసింది. 50 ఏళ్ల కానిస్టేబుల్ కి మెసేజ్ చేసింది.. మరో స్టేషన్ లో పని చేస్తున్న తోటి కానిస్టేబుల్ అని తేలింది. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: China – Pakistan: పాక్‌కు చైనా షాక్! టీటీపీకి డ్రాగన్ ఆయుధాలు..
బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ గురుగ్రామ్‌లోని సెక్టార్ 45లో నివసిస్తోంది. సెప్టెంబర్ 14వ తేదీ తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో తన కారులో ఆర్డి సిటీ గేట్ నంబర్ 2 నుంచి ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి చేరుకున్న వెంటనే.. సిమ్రాన్ చోప్రా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి 1:45 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి స్నేహపూర్వకంగా మెసేజ్ చేయడం ప్రారంభించాడు. “మేడమ్, మీరు ఈ గేట్ నంబర్ నుంచి టాటా పంచ్ కారులో వెళ్లిపోయారు కదూ..” అని సందేశం పంపాడు. ఆశ్చర్యపోయిన ఆ మహిళ, “అవును, కానీ మీరు నన్ను ఇంత రాత్రి ఎలా గుర్తుపట్టారు?” అని జవాబిచ్చింది. అవతలి వ్యక్తి, ” మేడమ్ మీరు చాలా అందంగా ఉన్నారు. మనం స్నేహితులుగా ఉండగలమా?” అని సందేశం పంపాడు. అసలు తన కారు, ఇన్స్టాగ్రామ్ ఖాతా తదితర వివరాలు ఈ గుర్తు తెలియని వ్యక్తికి ఎలా తెలిసిందని ఆమె ఆశ్చర్యపోయింది.
READ MORE: RRB Recruitment 2025: రైల్వేలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 8,875 పోస్టులు.. అస్సలు వదులుకోకండి..
దీంతో ఆమె ఆ వ్యక్తిని మందలించడమే కాకుండా సైబర్ క్రైమ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో నిందితుడు మరెవరో కాదు, ఈవీఆర్ లో పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్ విజయ్ అని తేలింది. అయితే అంతకు ముందు సైబర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు.. అక్కడి పోలీసు సిబ్బంది, అధికారుల వైఖరిపై వాపోయింది. బాధితురాలి ప్రకారం.. వారు ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించే ముందు నవ్వి, “మిమ్మల్ని ఆయన వేధించలేదు; వారు స్నేహం కోసం మాత్రమే అడిగారు. ఆ ఖాతాను బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా..” అని సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు నిందితుడైన కానిస్టేబుల్ విజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అతడిని సస్పెండ్ చేశారు.