రైల్వేలో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి లక్కీ ఛాన్స్. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది భారతీయ రైల్వే. ఏకంగా 8,875 పోస్టులు భర్తీ చేయడానికి రెడీ అవుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) RRB NTPC గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కోసం షాట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. త్వరలో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం, RRB మొత్తం 8,875 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 5,817 RRB NTPC గ్రాడ్యుయేట్లకు రిజర్వు చేయబడ్డాయి. 3,058 RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్లకు రిజర్వు చేయబడ్డాయి.
Also Read:Ajit Pawar: నిన్ను సీఎంను చేయమంటావా? వరద మహిళపై అజిత్ పవార్ ఆగ్రహం
CBT-1, CBT-2 పరీక్షల ఆధారంగా RRB NTPC గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. CBT-1 పరీక్షలో, అభ్యర్థులను జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుండి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో ఎంపికైన వారికి, CBT-2 నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు తేదీలను RRB త్వరలో ప్రకటిస్తుంది. కాబట్టి, అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ల కోసం అధికారిక వెబ్‌సైట్ www.rrbcdg.gov.in ని సందర్శించాలని సూచించారు.
RRB NTPC గ్రాడ్యుయేట్ ఖాళీలు
స్టేషన్ మాస్టర్ – 615
గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3423
ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైలు) – 59
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ – 161
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 638
RRB NTPC (అండర్ గ్రాడ్యుయేట్) ఖాళీలు
ట్రైన్ క్లర్క్ – 77
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 2424
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 394
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 163