Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi CJP Protest: ‘రాత్రి నుంచి తిరుగుతున్నాం.. ఇల్లు చేరడం కష్టమైపోయింది’.. ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల కారణంగా జనజీవనం ఎలా అస్తవ్యస్తమైందో చెబుతున్న మాటలివి. ఢీల్లీలో సీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతను పెంచడంతో పాటు 170కి పైగా లోకల్, షార్ట్ డిస్టెన్స్ రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఘజియాబాద్ వెళ్లాల్సి ఉంది. నిజాముద్దీన్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి లోకల్ రైలు పట్టుకోవాలని అనుకున్నాడు. కానీ అక్కడ రైళ్లు లేకపోవడంతో ఆటో, రిక్షా పట్టుకుని కొత్త దిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తీరా ఇక్కడకు వచ్చాక చూస్తే.. ఇక్కడ కూడా రైళ్లు రద్దయ్యాయని తెలిసి లబోదిబోమన్నాడు. మరో ప్రయాణికుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. రైళ్లు రద్దు అవుతాయన్న ముందస్తు సమాచారం లేకపోవడంతో ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డాడు. లక్నో వెళ్లి అక్కడి నుంచి వేరే రైలు చూసుకోవాలని, కుదరకపోతే బస్సులో వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. స్టేషన్‌లోని డిస్ప్లే బోర్డులపై వరుసగా రైళ్లు రద్దయిన వివరాలే కనిపిస్తుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
కేవలం రైళ్లే కాదు, రోడ్డు మార్గంలో ప్రయాణించేవారికి కూడా చుక్కెదురైంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రావడం కోసం ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. కానీ దారిలో విపరీతమైన ట్రాఫిక్, పోలీసులు ఎక్కడపడితే అక్కడ ఆంక్షలు విధించడంతో ట్యాక్సీ డ్రైవర్ మధ్యలోనే అతన్ని దించి వెళ్లిపోయాడు. దీంతో మరో ట్యాక్సీ వెతుక్కుని స్టేషన్‌కు చేరుకోవడానికి ఆ యాత్రికుడు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇక రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన మనీష్ అనే వ్యక్తికి జైపూర్ స్టేషన్లోనే పోలీసులు ఎదురయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఢీల్లీకి ఎందుకు వస్తున్నారు అని పోలీసులు ఆరా తీశారు. ఢిల్లీకి వస్తున్న చాలా మందిని దారిలోనే అడ్డుకుంటున్నట్లు, అదుపులోకి తీసుకుంటున్నట్లు అతనికి సమాచారం అందింది. దీంతో ఆందోళన స్థలానికి ఎలా చేరుకోవాలనే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. మరోవైపు. ఢిల్లీ సరిహద్దుల్లో, ముఖ్యంగా నోయిడా బోర్డర్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 సహా తదితర సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని, ఢీల్లీకి వచ్చే వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆందోళనకారులు గుమికూడాల్సి ఉండగా.. పోలీసుల ఆంక్షలు, రైళ్ల రద్దు నేపథ్యంలో జనం ఆందోళన స్థలానికి ఎంతవరకు చేరుకోగలరనే దానిపైనే అందరి దృష్టి నిలిచింది.
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
తాజావార్తలు
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!