Delhi Bomb Blast: దేశ రాజధానిలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు దాడి తర్వాత దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను కనుగొన్నాయి. 14 ఏళ్ల తరువాత రాజధానిలో జరిగిన అతిపెద్ద పేలుడుగా చెబుతున్నారు. అలాగే గత పార్లమెంటు దాడిలో నిందితుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు కనుగొన్నారు. గతంలో నిరక్షరాస్యులపై వారు మాత్రమే ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేవారని నమ్మేవాళ్లం. ప్రస్తుతం వైద్యులు, తదితర విద్యావంతులు ఉండటం గమనార్హం.
Ravindra Kaushik: ఒక వ్యక్తి మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశానికి భయం అంటే ఏంటో చూపించాడు. వారి ఆర్మీలోనే ఉంటూ, భారతదేశానికి పనిచేసిన గొప్ప వ్యక్తి, ‘‘బ్లాక్ టైగర్’’గా కొనియాడబడిన రవీంద్ర కౌశిక్ ధైర్యం, తెగువ చాలా మందికి ఆదర్శం. భారత గూఢచారిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ, నిఘా ఏజెన్సీలకు గర్వకారణం. అయితే, ఎప్పటికైనా ఒక గూఢచారిని కలవరపెట్టే అంశం, తన ముసుగు తొలిగిపోవడం. రవీంద్ర కౌశిక్‌కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఎవరు…
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తన స్థావరాన్ని మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధంగా పనిచేసే టీఆర్ఎఫ్ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, టీఆర్ఎఫ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా అమెరికా గుర్తించినందున తన హెడ్‌క్వార్టర్‌ను మార్చే పనిలో ఉంది.
వారం రోజులైనా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగాని యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో సన్నీ బయ్యను విచారిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్ర, సన్నీలను కలిపి ఎన్‌ఐఏ విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Tapan Deka: కేంద్ర ప్రభుత్వం నేడు (మే 20)న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ పొడిగింపు 2025 జూన్ 30 తర్వాత ప్రారంభమై 2026 జూన్ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుంది. తపన్ కుమార్ డేకా 1988 బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2022 జూలై 1న ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా బాధ్యతలు…
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారింది.
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…
సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టారు. ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే, ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, నాయకులు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్టులు, కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాలు, ఈ…
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘RAW’ అధికారి ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం నాడు న్యూస్ టెలికాస్ట్ చేసింది.