Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ సోదరుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో నిందితుడైన అతణ్ని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి పేరు హమూద్ అహ్మద్ సిద్దిఖీగా వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ”హమూద్ అహ్మద్ సిద్దిఖీ దాదాపు 25 ఏళ్ల క్రితం…
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రముఖ యూట్యూబర్ శ్యామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యాపారవేత్త వద్ద రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్యామ్‌పై ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేశారు. అనంతరం శ్యామ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాల ప్రకారం, శ్యామ్ సదరు వ్యాపారవేత్తను బెదిరించి రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు…
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు చిక్కడపల్లి పోలీసులు.