Delhi : ఆగ్రాలో దారుణం..భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి అత్తింటికి వెళ్ళిన ఓ భర్తను తన భార్య పక్కా ప్లాన్ తో అతి దారుణంగా చంపాలనుకుంది.. మాట్లాడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.. ఈ దారుణ ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే..
భర్తపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తమామల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. భార్య, ఆమె సోదరుడు మరియు ఆమె తల్లి కుట్ర పన్నారని, తన సోదరుడు ధర్మేంద్రను సజీవ దహనం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు భాధితుడి సోదరుడు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రాన్స్ యమునా కాలనీలోని తేవారి బాగియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
పోలీసుల ఫిర్యాదు ప్రకారం.. ప్రీతి, ధర్మేంద్ర నవంబర్ 8, 2019 న వివాహం చేసుకున్నారు. వివాహం అయినప్పటి నుండి ప్రీతి, ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తన స్నేహపూర్వకంగా లేదని బాధితుడి సోదరుడు లోకేష్ తెలిపారు. వివాహమైనప్పటికీ ప్రీతి తన తల్లిగారి ఇంటి వద్దే ఎక్కువ సమయం గడిపేదని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీతి మూడు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లింది.. ఇక జూలై 18, 2023 న, ధర్మేంద్ర ఆమెను కలవడానికి వెళ్ళాడు, ఆమెను తిరిగి తన అత్తమామల ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ధర్మేంద్ర ఇంట్లో ఉండగానే ప్రీతి, ఆమె తల్లి శిల్ప, ఆమె సోదరుడు అజయ్ సింగ్ పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతని అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే అతడిని వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రీతిని, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు..
- Tags
- Agra
- Crime News
- Delhi
- latest news
- viral
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?