Delhi Drug Trafficking: దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం భారీగా విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీ బ్యాగుల్లో దాచిపెట్టి గంజాయిని తరలించే ప్రయత్నం చేస్తుండగా కస్టమ్స్ సిబ్బంది గుర్తించారు. అధికారులకు స్కానింగ్ సమయంలో అనుమానం రావడంతో ఆ ఇద్దరి బ్యాగులను సోదా చేయగా అందులో పెద్ద మొత్తంలో గంజాయి బయటపడింది.
READ ALSO: Suzuki 350cc Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ.. 350 సీసీ బైక్‌ను విడుదల చేస్తోన్న సుజుకీ!
అధికారులు స్వాధీనం చేసుకున్న విదేశీ గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపుగా రూ.15 కోట్లు విలువ ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంజాయిని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన కేటుగాళ్లను అధికారులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి మీద NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విదేశీ మార్గాల ద్వారా డ్రగ్స్ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలను మరింత కఠినతరం చేసినట్లు కస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి.
READ ALSO: Krithi Shetty : భరించలేకపోతున్నాను – ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి