Deepika Padukone: ప్రపంచంలోని టాప్ 10 అందగత్తెల్లో భారత్ నుంచి దీపికా పదుకొనె ఎంపికయ్యారు. బ్రిటన్ కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డీ సిల్వ ఈ మేరకు అందమైన మహిళల వివరాలను ప్రకటించారు. పురాతన గ్రీక్ టెక్నిక్ లకు, అధునాత కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్ స్ట్రాటజీని (గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ) జోడించి డీ సిల్వ మహిళలకు స్థానాలు కేటాయిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా జోడీ కామర్ గుర్తింపు సంపాదించుకుంది. బియాన్స్, కిమ్ కదర్షియాన్ సైతం టాప్-10లోకి వచ్చేశారు.
Read Also: ORS : ‘ఓఆర్ఎస్ ద్రావకం‘ పితామహుడు దిలీప్ మహాలనబిస్ కన్నుమూత
దీపికా పదుకొనె 9వ ర్యాంకు సంపాదించుకుంది. జెండయా, బెల్లా హడిడ్, జోడీ కామర్ మొదటి స్థానం కోసం పోటీ పడ్డారు. జోడీ కామర్ మొదటి స్థానంలో నిలవగా, జెండయా, బెల్లా హడిడ్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. ముఖ కవళికలు, భౌతిక రూపం అన్నీ చూసిన తర్వాత ర్యాంకులను డీ సిల్వ కేటాయిస్తుంటారు. జోడీ కామర్ 98.7 స్కోరు సాధించింది. కచ్చితమైన ముఖాకృతికి కేవలం 1.3 శాతం దూరంలోనే ఆమె ఉండిపోయింది. జెండయా 94.37 శాతం, బెల్లా హడిడ్ 94.35 శాతం, బియాన్స్ 92.44 శాతం, అరియానా గ్రాండే 91.81 శాతం, టైలర్ స్విఫ్ట్ 91.64 శాతం, జోర్డాన్ డన్ 91.39 శాతం, కిమ్ కదర్షియాన్ 91.28 శాతం, దీపికా పదుకొణె 91.22 శాతం, హోయీన్ జంగ్ 89.63 శాతం ర్యాంకులతో టాప్-10లో ఉన్నారు.
Read Also: Sitrang Cyclone: ‘సిత్రాంగ్’ వచ్చేస్తోంది.. తస్మాత్ జాగ్రత్త