Deepika Padukone: దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన మాగ్నమ్ ఓపస్ మూవీ కల్కి 2898 ADలో దీపికా పదుకొనే కీలక పాత్రను పోషించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ క్రమంలో అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా దీపికా పదుకొనేను సీక్వెల్ నుండి తొలగించారు. దీనికి ఖచ్చితమైన కారణం కూడా వెల్లడైంది.
ప్రపంచ రికార్డు సృష్టించిన Adani Cement.. 54 గంటల్లోనే ఏకంగా!
కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపికా పదుకొనే తొలగించబడ్డారు. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటన విడుదల చేసి, ” కల్కి 2898 AD యొక్క రాబోయే సీక్వెల్ లో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా ప్రకటించారు. చాలా ఆలోచనల తర్వాత, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మొదటి సినిమా చేయడానికి సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ, మేము కలిసి సినిమా చేయలేక పోతున్నాము.” అని పేర్కొన్నారు. అంతేకాక ఆసక్తికరంగా, ఆ ప్రకటనలో కమిట్మెంట్ అనే పదం వాడడం అనేక చర్చలకు దారి తీస్తోంది.
Bathukamma 2025: బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు.. బాట పువ్వులే అమ్మవారు!
“కల్కి 2898 AD వంటి చిత్రం ఆ కమిట్మెంట్ కు, మరెన్నో విషయాలకు అర్హమైనది.” అని ఆ అంటూనే ఆమె భవిష్యత్ సినిమాలకి మేము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.” అని పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. అయితే అలా ఆమెను తప్పించానికి కారణం అర్థం లేని డిమాండ్స్ అని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ సహా స్టార్ హీరో రేంజ్ ట్రీట్మెంట్ సహా ఎన్నో గొంతెమ్మ కోరికలు కోరినట్టు చెబుతున్నారు. ఆమెను స్పిరిట్ నుంచి సందీప్ రెడ్డి వంగా ఎందుకు తప్పించాడో ఇప్పుడు కూడా అవే కారణాలతో తప్పించినట్టు సమాచారం.