భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించినాట్లు కనపడుతోంది. ప్రపంచ వార్తలను ప్రసారం చేసే జాతీయ దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో రంగును తాజాగా కాషాయ రంగులోకి మర్చి తన విధేయతను తెలిపింది. ఇక ఈ మార్పులో కేవలం రంగు మాత్రమే కాకుండా లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి మార్చడం వల్ల కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై పెద్దయెత్తున…