DC vs RCB: నేటి డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి తన సొంత మైదానంలో ఆడే విరాట్ కోహ్లీ పైనే ఉండనుంది. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ జట్టు రెండవ స్థానంలో ఉండగా, ఆర్సీబీ మూడవ స్థానంలో ఉంది. ఇక ఈరోజు మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో మరింత దూసుకుపోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో ఇరుజట్లు ఇదివరకు బెంగళూరు వేదికగా ఐదవరకే తలపడగా ఆ మ్యాచ్ లో ఆర్సీబీ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయ ఢంకా మోగించింది. ఇక నేటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లెక్కను ఎలాగైనా సరిచేయాలని ఆర్సీబీ బరిలోకి దిగుతుంది. ఇక నేడు ఆడబోయే ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI:
ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విపరాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్స్:
అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మాధవ్ తివారీ, త్రిపూర్ణ విజయ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI:
విరాట్ కోహ్లీ, జాకబ్ బెతేల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, రషీద్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, స్వప్నిల్ సింగ్.