Addanki Dayakar: “అన్నీ మీరే కదా చేసింది”..కేసీఆర్ పై అద్దంకి దయాకర్ ఫైర్
- కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదు
- విచారణలో కేసీఆర్ పేరు రాగానే ఇబ్బంది పడుతున్నారు
- ఎవరినో నిందితులుగా చేయడానికి విచారణ చేపట్టడం లేదని దయాకర్ స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ అన్నారు. అన్నీ చేసింది మీరే కదా అని ఫైర్ అయ్యారు. అన్ని శాఖలో మీరు చెప్పిందే వేదం కదా అని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారు. మీ హయాంలో మంత్రులు చేసింది ఏముంది.. అంతా మీరే కదా చేసింది. కేసీఆర్ బెదిరించే ధోరణి సరికాదు. విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణకు ఆదేశించాం. ఎవరినో నిందితులుగా చేయడానికి కాదు” అని దయాకర్ స్పష్టం చేశారు.
REDA MORE: Seethakka:మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల రుణాలు..మంత్రి సీతక్క వెల్లడి
Also Read
కాగా.. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని తెలిపారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని, ఇది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కమిషన్ నోటిస్ జారీ చేసింది.. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిషన్‌కు 12 పేజీల లేఖ కేసీఆర్ రాశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?