David Warner Batting: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్.. నవ్వుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్! చివరకు
Pat Cummins laughs after David Warner bats Right Handed: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లెఫ్టాండర్ అన్న విషయం తెలిసిందే. అయితే వేగంగా పరుగులు చేసేందుకు వార్నర్ అప్పుడప్పుడు తన స్టాన్స్‌ను మార్చుకుని రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు ఆడిన దేవ్ భాయ్.. సిక్సులు, బౌండరీలు కూడా బాదాడు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో కూడా వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ నవ్వులు పూయించాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. తొలి బంతిని అశ్విన్ ఆఫ్ బ్రేక్ వేయగా.. పాయింట్ దిశగా సింగిల్ తీశాడు. మూడో బంతికి స్వీప్ ద్వారా బౌండరీ బాదాడు. నాలుగో బంతికి మరో సింగిల్ తీశాడు. ఇది గమనించిన యాష్.. 15వ ఓవర్ తొలి బంతిని క్యారమ్ బాల్‌గా సంధించాడు. ఆ బంతిని స్విచ్ హిట్ చేయబోయిన వార్నర్.. వికెట్ల ముందు దొరికిపోయాడు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: BAN vs NZ: మా కెప్టెన్ అలా చేయడం సరికాదు.. ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ మ్యాచులో డేవిడ్ వార్నర్ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అయితే ఆర్ అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్ ఔట్ అవ్వడం విశేషం. రైట్ హ్యాండ్ ఆడుతూ.. స్విచ్ హిట్ ప్రయత్నించబోయి ఎల్బీ అయ్యాడు. అయితే రివ్యూలో బంతి ప్యాడ్ల కంటే ముందు బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా తేలింది. వార్నర్ రివ్యూ తీసుకోకపోవడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై నెటిజన్లు వార్నర్‌పై మండిపడుతున్నారు. బ్యాట్‌కు బంతి తాకిన సోయి లేకుండా ఆడుతున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచులో ఆసీస్ 99 పరుగుల తేడాతో ఓడింది.
David Warner vs Ravichandran Ashwin….!!!
– One of the best moments in this ODI series. pic.twitter.com/Wjuv47ddwN
— Johns. (@CricCrazyJohns) September 24, 2023
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో