Site icon NTV Telugu

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!

David Warner

David Warner

David Warner Arrested: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్స్ లో ఒక్కడైన ‘డేవిడ్ వార్నర్’ చిక్కుల్లో పడ్డారు. సిడ్నీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో ఆడుతున్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో స్వదేశానికి వెళ్లగా.. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

సిడ్నీలోని మరోబ్రా (Maroubra) ప్రాంతంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా డేవిడ్ వార్నర్ మద్యం సేవించినట్లుగా తేలింది. వార్నర్ తన కారులో వెళ్తూ బ్రీత్ అనలైజర్ టెస్టింగ్ సైట్ చేరుకోకముందే తన వాహనాన్ని పక్కన నిలిపివేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఆయన వాహన దెగ్గరకు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రాథమిక పరీక్షలో ఆయన మద్యం సేవించినట్లు తేలడంతో పోలీసులు వార్నర్‌ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆ తర్వాత మరోబ్రా పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పరీక్షల్లో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదైంది. ఇది చట్టబద్ధమైన పరిమితి కంటే చాలా ఎక్కువ అని తేలింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి మే 2026లో కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. వచ్చే నెలలో ఈ ఘటనపై కోర్టులో విచారణ జరగనుంది.

Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఈ లీగ్‌లో ఆయన జట్టు వరుసగా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. సిడ్నీలో ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ఏప్రిల్ 9న కరాచీలో పెషావర్ జల్మీతో జరగనున్న తదుపరి మ్యాచ్ సమయానికి వార్నర్ పాకిస్థాన్‌ చేరుకుంటారని సమాచారం.

Exit mobile version