ఇండియా పాకిస్థాన్ బోర్డర్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. అమెరికా మధ్యవర్తిత్వం పని చేయలేదు. సీజ్ ఫైర్ ను బ్రేక్ చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ దుశ్చర్యలకు ఆ దేశ క్రికెట్ బోర్డు నష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పటికే PSL రద్దైంది. PSL లో పాలొన్న విదేశీ ఆటగాళ్లను సైతం పట్టించుకోలేదు. తమ దేశానికి వచ్చిన విదేశీ ఆటగాళ్లను తమ స్వస్థలాలకు పంపించడంలో పాక్ క్రికెట్ బోర్డు ఘోరంగా విఫలమైంది. ఆటగాళ్లు పాక్ బోర్డర్ దాటే వరకు భయంభయంగా గడిపారు.
Also Read:Vijay 69 : జననాయగాన్ విజయ్ పిక్ లీక్.. రీమేక్ అని కన్ఫర్మ్ అయినట్టే.?
దుబాయ్ లో అడుగుపెట్టిన విదేశీ ఆటగాళ్లు తమ బాధలను చెప్పుకుని గుక్కపెట్టి ఏడ్చారు. ఇంకోసారి పాకిస్థాన్ భూభాగంలో అడుగుపెట్టమని అన్నారు. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ మాట్లాడుతూ జన్మలో పాకిస్థాన్ లో అడుగుపెట్టనని చెప్పాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ టామ్ కుర్రాన్ గుక్కపెట్టి ఏడ్చాడు. పాకిస్థాన్ నుంచి ప్రాణాలతో బయటపడతాం అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Also Read:NBK : జైలర్ 2 కోసం బాలయ్య అంత తీసుకున్నాడా..?
PSL లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ క్షేమంగా బయటపడ్డారు. అయితే వాళ్ళు పాక్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు తమ సమీపంలో క్షిపణి దాడి జరిగిందని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర రిషాద్ చెప్పాడు. ఏదేమైనా వచ్చే సీజన్లో PSL లో విదేశీ ప్లేయర్లు ఆడకపోవచ్చు. మరోవైపు IPL లో పాల్గొన్న విదేశీ ప్లేయర్లను బీసీసీఐ క్షేమంగా వారి స్వస్థలాలకు పంపించింది.