Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన

  • హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి సీఎం శంకుస్థాపన
  • రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం
  • కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయి :మంత్రి దామోదర రాజనర్సింహ
Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు.

కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రిని నిర్మించనున్నామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిని ఆధునికీకరించి, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి రాజనర్సింహ తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు అమల్లోకి వచ్చిందని, త్వరలోనే పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..