Dalapathi Vijay: తమిళనాడులో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమరానికి శనివారం సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ శంఖం పూరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చజరుగుతుంది. శనివారం విజయ్ తిరుచ్చిలో ‘ఐ యామ్ కమింగ్’ పేరుతో భారీ ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. విజయ్ ఇప్పటికే ‘మీట్ ది పీపుల్స్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ వరకు ప్రతి శని, ఆదివారాల్లో జనంలోకి…