Daggubati Purandeswari: బొత్సకు పురంధేశ్వరి కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం అన్నారు.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది.. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని దుయ్యబట్టారు.. వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న ఆమె.. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదు.. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారు..? అని నిలదీశారు.. ఇక, పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని బొత్సకు హితవు పలికారు దగ్గుబాటి పురంధేశ్వరి.
Read Also: Delhi: డానిష్ రాయబారి వీడియో వైరల్.. అందులో ఏముందంటే..?
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
కాగా, దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చెయ్యలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తిన విషయం విదితమే.. ప్రధాని పదవికి మోడీ విలువ లేకుండా చేశారని మండిపడ్డ ఆయన.. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని నిలదీశారు.. ఏపీ ప్రజల అవసరాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.. ప్రధాని మోడీ అదే నోటితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? అని గుర్తుచేశారు.. ప్రధాన మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. ఇంతలా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడిన విషయం విదితమే.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!