Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియపై ఏఐఎస్‌ఎఫ్ (AISF) నాయకులు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకరమైన, అర్థనగ్న ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తోందని వారు ఆరోపించారు. ఇటువంటి కంటెంట్ యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని సామాజిక బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
కేవలం ఫోటోలే కాకుండా ‘సబ్‌స్క్రిప్షన్’ మోడల్ ద్వారా ఎక్స్‌పోజింగ్ కంటెంట్‌ను షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేయడం నేరమని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మండిపడ్డారు. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటం సరికాదని తక్షణమే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాలని వారు పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బిగ్ బాస్ షో తర్వాత విష్ణుప్రియకు క్రేజ్ పెరిగినప్పటికీ ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లపై తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. గ్లామర్ షో విషయంలో ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ అది తన వ్యక్తిగత ఇష్టమని గతంలో పలుమార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు నేరుగా సైబర్ క్రైమ్ పోలీసుల వరకు ఈ విషయం వెళ్లడంతో ఆమె ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..