KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ‘హిట్ మెషీన్’గా పేరుతెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి భారీ మల్టీస్టారర్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఈ ప్రాజెక్ట్‌లో ఉంటుందా? లేదా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
ఇటీవల జరిగిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ కృతి శెట్టిని ఉద్దేశించి “నువ్వు నా సినిమాలో నటిస్తున్నావని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం” అంటూ కృతి ఎంపికను అధికారికంగా ధృవీకరించారు. ఈ చిత్రంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ ఇద్దరూ హీరోలుగా నటిస్తుండగా నందమూరి కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వెంకటేష్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిజానికి కృతి శెట్టికి గత రెండేళ్లుగా తెలుగులో సరైన సక్సెస్ లేదు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తున్న తరుణంలో అనిల్ రావిపూడి ఆమెను తన సినిమాలో తీసుకోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ల విషయంలో దర్శకులు వెనకడుగు వేస్తుంటారు. కానీ అనిల్ మాత్రం కృతి ప్రతిభపై నమ్మకంతో ముందడుగు వేశారు. ఆమె తెలుగు మాట్లాడే తీరును నటనను అనిల్ ప్రశంసించడం విశేషం. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కృతి శెట్టికి ఈ మెగా ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఒక పెద్ద ‘బూస్ట్’ అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!