Custody : అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమా ఫస్ట్ షో నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో శుక్రవారం రిలీజైంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెంకట్ ప్రభుకు పేరుంది. ఈ సినిమాలో విలన్ గా అరవిందస్వామి, ప్రధాన పాత్రలో ప్రియమణి నటించారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు మేకర్స్. ఈ సినిమా దాదాపుగా రూ.21.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ రూ.22.50 కోట్లకు క్లోజ్ గా ఉండడంతో ఈసారి చైతన్య ప్రొడ్యూసర్ జేబులో నియమింపడం ఖాయమని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీనికి తోడు తాజాగా విడుదలైన ఈ సినిమా డిసెంట్ టాకుతోనే రన్ అవుతుంది. ఇక భారీగానే ఓపెనింగ్స్ వచ్చేలా ఉండడంతో ఈ లెక్కన చూస్తే ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ ఖుషి అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also:ED Notices: చీకోటికి తప్పని చిక్కులు.. పన్ను చెల్లించనందుకు ఈడీ నోటీసులు
ఇక యూఎస్ లో అయితే మరింత స్ట్రాంగ్ గా ఈ చిత్రం పుంజుకోవడం విశేషం. ప్రీమియర్స్ సహా డే కి అయితే ఈ చిత్రం ఏకంగా లక్ష డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి 1 లక్ష 15 వేల డాలర్స్ నమోదు చేసింది. దీనితో ఈ చిత్రంకి సాలిడ్ ఓపెనింగ్స్ తో డే 1 స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక వీకండ్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఈ పీరియాడిక్ డ్రామా ని నిర్మాణం వహించారు. థాంక్యూ సినిమా గోరమైన డిజాస్టర్ తర్వాత నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాతో ఏ మేరకు కలెక్షన్లు రాబడతారో చూడాలి మరి. నాగచైతన్య ఈమధ్య కాలంలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య తన తదుపరి చిత్రంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also:Krithi Shetty : సమంతలా చేయను కానీ.. రొమాంటిక్ సీన్స్ కు రెడీ
The Blockbuster Hunt begins 💥#Custody USA Day 1 (including premieres) $115K+ and counting… @ 7.30 AM PST on 5/12 Friday
Book your tickets now
USA Release by @PrathyangiraUS @chay_akkineni @IamKrithiShetty @vp_offl @thearvindswami @SS_Screens @srinivasaaoffl… pic.twitter.com/DG4n6fmwsW
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 12, 2023