Krithi Shetty : ఉప్పెనతో జనాల చేత ముద్దుగా బేబమ్మ అనిపించుకుంది కృతి శెట్టి. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా వరుసగా రెండు విజయాలు సాధించింది. కానీ ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. తాజాగా నాగచైతన్య సరసన కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బంగార్రాజు సినిమా హిట్ తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమా మంచి విజయం సాధించి మరోసారి ఈ పెయిర్ కి సక్సెస్ ని ఇచ్చింది.
Read Also: Journalists Health Camp; జర్నలిస్ట్ హెల్త్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి
ఇక కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల కృతి శెట్టి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంలోనే ఓ విలేకరి ఊ అంటావా.. ఊ ఊ అంటావా..లాంటి పాటలను చేస్తారా అని అడిగారు. దానికి కృతి.. ప్రస్తుతానికి తాను అలాంటి సాంగ్స్ చేయనంటూ సమాధానమిచ్చింది. తనకు కెరీర్ చాలా ఉందని.. ఇప్పట్లో అలాంటి పాటలు ఒప్పుకోనని స్పష్టం చేసింది. అలాంటి పాటలపై తనకు ఐడియా లేదంది. తన సినీ ప్రయాణంలో తెలుసుకున్నది ఒకటే. సౌకర్యంగా లేకపోతే చేయకపోవడమే మంచిదంటూ రిప్లై ఇచ్చింది. కానీ ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. సాంగ్ లో సమంత మాత్రం చాలా బాగా డ్యాన్స్ చేసింది అని తెలిపింది. కృతి శెట్టి గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించింది. ఆ సినిమా అప్పుడే రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది అమ్మడు. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ తో సినిమాలో రొమాన్స్ ఉన్నా కృతి నుంచి ఐటెం సాంగ్స్ మాత్రం రావని అర్ధమవుతుంది.
Read Also:Indian Railways : రైలులో ప్రయాణించేటప్పుడు ఎంత మద్యం తీసుకెళ్లవచ్చు ?