Currency Notes printing: ప్రతినిత్యం ఏదో ఒక అవసరం కోసం మనం డబ్బుల్ని హెచ్చించాల్సిన పరిస్థితి. మన దేశంలో మనం వివిధ రంగుల కాగితాలను కరెన్సీగా వాడుతున్నాము. అయితే, ఈ కరెన్సీ ని తయారు చేయడానికి ప్రభుత్వం అనేక రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకొని వాటిని చలామణి చేస్తున్నారు. మరి ఈ కరెన్సీ కుద్రించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? లేదు కదా.. మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా..
Chia Seeds Vs Sabja Seeds: చియా సీడ్స్ vs సబ్జా సీడ్స్.. శరీరానికి ఏవి మంచివి?
ఈ కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ కి ఎంత ఖర్చు అవుతుందన్నా విషయం సంబంధించి.. ఆర్బిఐ రిపోర్ట్ ప్రకారం.. రూ.10 నోటు తయారు చేయడానికి 96 పైసలు ఖర్చువుతుంది. అదే రూ.20 నోటుకు 95 పైసలు, రూ.50 నోటుకు రూ.1.13 పైసలు, రూ.100 నోటుకు రూ.1.77 పైసలు, రూ.200 నోటుకు రూ.2.37 పైసలు, రూ.500 నోటుకు రూ.2.29 పైసలు, అలాగే చలామణిలో లేని రూ.2000 నోటుకు రూ.3.54 పైసలు ఖర్చువుతుంది.
Sai Durga Tej : సెకండ్ క్లాస్ లోనే లవ్ చేశా.. రీసెంట్ గా బ్రేకప్ అయింది
2024-25లో కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ కోసం ఆర్బిఐ దాదాపు రూ.6372 కోట్లు ఖర్చు చేసింది. ఫేక్ కరెన్సీని అడ్డుకునేందుకు హై సెక్యూరిటీ ఫీచర్స్ అయినా వాటర్ మార్క్, మైక్రో లెటరింగ్, సెక్యూరిటీ త్రెడ్, కలర్ షిఫ్టింగ్, ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వంటివి వాడుతారు ఈ నోటా తయారీలో. నిజానికి ప్రింటింగ్ ప్రాసెస్ లో వీటికే ఎక్కువ ఖర్చుఅవుతుంది. భారత్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రింటింగ్ ప్రెస్లలో ఈ కరెన్సీలను ప్రింట్ చేస్తున్నారు. మొత్తం సర్క్యులేషన్ లో 500 రూపాయల నోట్లు దాదాపు 40% ఉన్నాయి. ఇది మొత్తం కరెన్సీ వాల్యూలో ఇది 80% కన్నా ఎక్కువగా ఉంటుంది.