Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన సాయితేజ్.. తన లవ్ వ్యవహారాలను పంచుకున్నాడు. నాకు 2023లో బ్రేకప్ అయింది. అది చాలా బాధాకరమైన బ్రేకప్. ఇప్పటి వరకు నాకు జరిగిన బ్రేకప్ లలో ఇదే చాలా హార్డ్ గా అనిపించింది. నా సినిమాలు హిట్ కావడంతో ఆమెతో పెళ్లి.. ఈమెతో పెళ్లి అంటూ రకరకాల రూమర్లు మీడియాలో వచ్చాయి. దాంతో ఆమె భయపడిపోయింది. ఆమె నా కాలేజ్ ఫ్రెండ్. ఇవన్నీ తట్టుకోలేకపోయింది.
Read Also : Raghava Lawrence : వాళ్లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్.. ఎందుకంటే..
అందుకే బ్రేకప్ చెప్పింది. మీడియా సైలెట్ గా ఉంటే నా పెళ్లి డేట్ నేనే చెప్తాను. ఈ రోజుల్లో తల్లిదండ్రులతో పిల్లలు చాలా టైమ్ గడపాలి. అన్ని విషయాలను చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి. నేను రెండో తరగతిలోనే ఓ అమ్మాయిని లవ్ చేశా. ఆ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. అలా అన్ని విషయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ ఇప్పటి తరం అలా లేదు. చాట్ జీపీటీ, ఏఐ అంటూ వెళ్తున్నారు. మొబైల్ ఫోన్లతోనే ఎక్కువగా గడిపేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి తగ్గించుకుంటేనే చాలా బెటర్ అని చెప్పుకొచ్చాడు సాయిదుర్గతేజ్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : The Rajasaab : ది రాజాసాబ్ బడ్జెట్ చెప్పిన మారుతి.. వామ్మో అన్ని కోట్లా..