Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Crime News Hyderabad Wife Lover Kills Husband Extramarital Affair

Extramarital Affair: భార్య చేతిలో మరో భర్త హతం.. ఇంకా నిద్ర లేవడం లేదని డ్రామా ఆడి..!

Published Date :August 30, 2025 , 10:11 pm
By Sampath Kumar
  • భార్య చేతిలో మరో భర్త హతం
  • శేఖర్, చిట్టికి 2009లో వివాహం
  • వారికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు
  • ఇంకా నిద్ర లేవడం లేదని డ్రామా ఆడి
Extramarital Affair: భార్య చేతిలో మరో భర్త హతం.. ఇంకా నిద్ర లేవడం లేదని డ్రామా ఆడి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో ఓ భార్య వేసిన స్కెచ్‌కు భర్త ఊపిరి ఆగిపోయింది. ప్రియుడితో కలిసి చంపేసి.. అనంతరం ‘భర్త పడుకుని ఇంకా లేవడం లేదని’ డ్రామా ఆడింది కిలాడి. కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారానికి చెందిన జల్లెల శేఖర్.. రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టితో 2009లో వివాహం జరిగింది. వారికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం వారు హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ప్రాంతం కోదండరామనగర్‌కు వలస వచ్చి ఉంటున్నారు. శేఖర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిట్టి స్థానికంగా ఉన్న ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. వారి కుమార్తె ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటోంది. కుమారుడు తల్లిదండ్రుల వద్దే ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు.

కొన్నాళ్లకు చిట్టికి స్థానికంగా ఉండే హరీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇంకేముంది సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో వివాహేతర బంధం చిచ్చు పెట్టింది. నగలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో భార్య ప్రవర్తనపై భర్త శేఖర్‌కు అనుమానం వ్చచింది. దీంతో ఈ వస్తువులు ఎక్కడివి.. ఏం చేస్తున్నావ్ అంటూ చిట్టిని భర్త ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య భావించింది. ప్రియుడు హరీశ్‌తో కలిసి అందుకు ప్రణాళిక వేసింది.

తమ ప్లాన్ అమలు చేసేందుకు.. కుమారున్ని వినాయక మండపంలో స్నేహితులతో కలిసి పడుకోవాలని సూచించింది. తర్వాత అర్ధరాత్రి ప్రియుడు హరీష్‌ను పిలిపించింది చిట్టి. హరీష్ రాగానే ఇద్దరూ కలిసి శేఖర్‌ను నిద్రలోనే గొంతు నులిమి చంపేశారు. కానీ చనిపోయాడో లేదోనన్న ఉద్దేశ్యంతో డంబెల్‌తో తలపై మోదింది. ఈ ఘటన తర్వాత ప్రియుడు హరీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శేఖర్‌ను చంపిన తర్వాత మధ్యాహ్నం వరకు ఇంట్లో మామూలుగానే గడిపింది చిట్టి. ఇంట్లో ఉన్న కొడుకుకి టిఫిన్ చేయించి బయటికి పంపించింది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత నాన్న ఇంకా నిద్ర లేవలేదా? అని కొడుకు అడగగా.. అప్పుడు శేఖర్ చనిపోయాడన్న విషయాన్ని కొడుకుకు చెప్పింది. అదే సమయంలో పక్కనే ఉన్న మహిళ వచ్చి చూసేసరికి అప్పటికే శేఖర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని వెంటనే కేకలు వేసి అందరిని పిలిచింది.

స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో చిట్టిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు హరీశ్‌తో కలిసి భర్త శేఖర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ఆమె ప్రియుడు హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే హరీష్‌కు చిట్టికి మధ్య ఉన్న వివాహేతర సంబంధంపై శేఖర్‌కు తెలియడంతో స్వగ్రామమైన నాగర్ కర్నూల్‌లో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అదే సమయంలో చిట్టి నాగర్ కర్నూల్లోని తమ ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో అందరూ కలిసి శేఖర్‌ని తిట్టి భార్యను సరిగ్గా చూసుకోవాలంటూ బుద్ధి చెప్పి పంపించారు. ఇక చిట్టికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇష్టానుసారంగా హరీష్‌ను శేఖర్ లేనప్పుడు ఇంటికి పిలిపించడం, వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ విషయంపై భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో శేఖర్ తమకు అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించిన చిట్టి హరీష్ అతన్ని హత్య చేశారు.

హరీష్ అనే వ్యక్తి తన తండ్రి స్నేహితుడని, తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడని, ఈ విషయంపై అమ్మానాన్నల మధ్య గొడవలు జరుగుతుండేవని శేఖర్ కూతురు చెబుతోంది. మరోవైపు తండ్రి చనిపోవడం, తల్లి పోలీస్ స్టేషన్లో ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ బయట ఇద్దరు పిల్లలు బంధువుల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • extramarital affair crime
  • hyderabad
  • hyderabad crime news
  • saroornagar

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions