Site icon NTV Telugu

Shreyas Iyer : పాపం పంజాబ్ కెప్టెన్ కొంపముంచిన ఆ తప్పు .. మ్యాచ్ గెలిచిన రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!

Shreyas Iyer Prety Zinta

Shreyas Iyer Prety Zinta

Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బోణి కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ (BCCI) మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్‌పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

READ ALSO: PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్

అయ్యర్‌కు రూ.12 లక్షలు ఫైన్..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ‘స్లో ఓవర్ రేట్’ (Slow Over-rate) నిబంధనను ఉల్లంఘించినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల (1.2 మిలియన్లు) జరిమానా విధించినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు. ఇది మొదటి తప్పు కావడంతో కేవలం ఫైన్‌తో సరిపెట్టారు, ఇదే మళ్లీ రిపీట్ అయితే కెప్టెన్‌పై నిషేధం పడే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ ఆటగాడు కూపర్ కానలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలిచినప్పటికీ వ్యక్తిగతంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. బ్యాటింగ్‌లో కేవలం 18 పరుగులకే వెనుదిరగడమే కాకుండా, చేతికి గాయం కావడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు భారీ జరిమానా పడటంతో అయ్యర్ ఫ్యాన్స్ డబుల్ షాక్‌కు గురయ్యారు.

READ ALSO: PAN Card : మీ పాన్ కార్డులో దాగున్న సీక్రెట్ తెలుసా.. ఆ 10 అంకెల అర్థం తెలిస్తే షాక్ అవుతారు!

Exit mobile version