Shreyas Iyer : పాపం పంజాబ్ కెప్టెన్ కొంపముంచిన ఆ తప్పు .. మ్యాచ్ గెలిచిన రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బోణి కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ (BCCI) మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్‌పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
READ ALSO: PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
అయ్యర్‌కు రూ.12 లక్షలు ఫైన్..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ‘స్లో ఓవర్ రేట్’ (Slow Over-rate) నిబంధనను ఉల్లంఘించినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల (1.2 మిలియన్లు) జరిమానా విధించినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు. ఇది మొదటి తప్పు కావడంతో కేవలం ఫైన్‌తో సరిపెట్టారు, ఇదే మళ్లీ రిపీట్ అయితే కెప్టెన్‌పై నిషేధం పడే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ ఆటగాడు కూపర్ కానలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలిచినప్పటికీ వ్యక్తిగతంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. బ్యాటింగ్‌లో కేవలం 18 పరుగులకే వెనుదిరగడమే కాకుండా, చేతికి గాయం కావడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు భారీ జరిమానా పడటంతో అయ్యర్ ఫ్యాన్స్ డబుల్ షాక్‌కు గురయ్యారు.
READ ALSO: PAN Card : మీ పాన్ కార్డులో దాగున్న సీక్రెట్ తెలుసా.. ఆ 10 అంకెల అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?