V Srinivasa Rao: మోడీకి పదవిలో ఉండే అర్హత లేదు.. అవిశ్వాస తీర్మానానికి ఏపీ ఎంపీలు మద్దతివ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Srinivasa Rao: నరేంద్ర మోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాలు.. ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో సగానికిపైగా MPలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది. లేదంటే వీగిపోతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదో కీలక ఘట్టం. విపక్ష కూటమి ఇండియాగా ఏర్పడిన తర్వాత ఇచ్చిన తాజా అవిశ్వాస తీర్మానంపై ఆసక్తి నెలకొంది. ఇక, ప్రస్తుతం లోక్‌సభలో సంఖ్యాపరంగా ఎన్డీయే కూటమి బలంగా ఉంది. కాకపోతే లోకసభ ఎన్నికలకు 8 నెలల ముందు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతోపాటు.. మణిపూర్ హింస బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పరిణామం కావడంతో వాడీవేడీ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అవిశ్వాస తీర్మానాన్నికి ఏపీ ఎంపీలు దూరంగా ఉండడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మండిపడుతున్నారు.
Read Also: CM KCR: హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Also Read
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
నరేంద్ర మోడీపై బీఆర్ఎస్‌తో సహా అనేక పార్టీ లు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.. కానీ, మన ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలు 25 మంది మోడీకి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు అని మండిపడ్డారు శ్రీనివాసరావు.. ఏపీకే మోడీ తీవ్రమైన అన్యాయం చేశారు.. కానీ, అంతా బాగుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడానికి సిగ్గుందా? అంటూ ఫైర్ అయ్యారు.. బీజేపీ బీ టీమ్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు నిర్ధారణ అయ్యిందన్న ఆయన.. టీడీపీ ఎంపీలు మౌనంగా ఉండి దోబూచులాడారని విరుచుకుపడ్డారు.. మణిపూర్ ఘటన చూసైనా మన ఎంపీలు మారలేదంటే వాళ్లకి మనసు ఉందా? అని నిలదీశారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, కేంద్రీయ విద్యాలయం హామీలు అమలు చేయలేదన్నారు. ఇక, గంగవరం పోర్ట్ ను ఏపీ ప్రభుత్వం జాతీయం చేయాలన్న ఆయన.. మోడీకి ప్రధాని పదవిలో ఉండే అర్హత లేదు.. అవిశ్వాస తీర్మానానికి ఏపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఏపీకి న్యాయం చేయాలని ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!