NTV Telugu Site icon

CPI Ramakrishna: ఈ ఘటనకు వాళ్ల వైఫల్యమే కారణం.. సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Cpi Ramakrishna

Cpi Ramakrishna

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన భక్తుల్లో కలకలాన్ని రేపింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఛైర్మన్ శ్యామల రావు అన్నారు. కాగా.. మృతులు విశాఖకు చెందిన జి. రజనీ(47), లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడు బాబుగా గుర్తించారు.

READ MORE: AP BJP: నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..

ఇదిలా ఉండగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నేతలు తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… టీటీడీ, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. “ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని టిటిడి ఛైర్మన్ పదే పదే చెబుతున్నారు. కానీ సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా మారిందో మనం చూశాం. వీఐపీలకు మాత్రం పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం చాలా విశాలంగా ఉంది. పోలీసులు లేకపోయినట్లయితే ఈ ఘటన జరిగేది కాదు. ఎవరికి వారుగా క్యూలో వెళ్లి టోకెన్లు తీసుకునేవారు. భక్తులను పోలీసులు.. కట్టడి చేసి ఒక్కసారిగా వదలడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.” అని పేర్కొన్నారు.

READ MORE: Top Headlines @9AM : టాప్ న్యూస్

Show comments