BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వంల తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేయడానికి మామ అల్లుళ్ళు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే పవన్.. బ్రో సెట్ లో అడుగుపెట్టి షూటింగ్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఇక తాజాగా నేడు అల్లుడు సాయి ధరమ్ తేజ్ బ్రో సెట్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. సాయి ధరమ్ తేజ్ తో.. డైరెక్టర్ సముతిరఖని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. కిక్ స్టార్టింగ్ విత్ మై బ్రో అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
NTR: ఎన్టీఆర్ పై ఎందుకింత నెగెటివిటీ.. ?
ఇక ఫోటోలో తేజ్.. చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. కొద్దిగా ఒళ్లు చేసినట్లుగా కూడా కనిపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న తేజ్.. మళ్లీ మునుపటి రూపంలోకి వస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మామతో పాటు అల్లుడు కూడా గట్టి రచ్చ చేసేలానే ఉన్నాడు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా జూలై 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి ఇంత స్పీడ్ గా సినిమాను కానిచేస్తున్న ఈ మామ అల్లుళ్లు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.