రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదికను సీపీ సుదీర్ బాబు వెల్లడించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది పెరిగిన నేరాలుసంఖ్య, గత ఏడాది28,626 కేసులు నమోదు కాగా, 2025 లో 33,040 కేసులు నమోదైనట్లు తెలిపారు. రాచకొండ లో పెరిగిన కిడ్నాప్ కేసులు, ఫోక్సో కేసులు సంఖ్య పెరిగాయి. కిడ్నాప్ లు 579 కేసులు నమోదు, ఫోక్సో 1224 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నమోదైన కేసులు మర్డర్ ఫర్ గెయిన్ కేసులు 3.. దోపిడీ 3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీ 589, వాహనాల చోరీలు 876, సాధారణ చోరీలు 1, 161, హత్యలు 73, అత్యాచారలు 330, వరకట్నం చావులు 12, గృహ హింస కేసులు 782, గత ఏడాదితో పోలిస్తే మహిళ పై నేరాల సంఖ్య 4శాతం పెరిగినట్లు తెలిపారు.
డ్రగ్స్ కేసులు :- ఈఏడాది 20 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్ కేసుల్లో 668 మంది నిందితులు అరెస్ట్. 256 డ్రగ్స్ కేసులు నమోదు, ఇందులో 2090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాక్లెట్లు, 34 కేజీల హ్యాష్ ఆయిల్ , 216 గ్రాముల MDMA , 10 కిలోల OPM, 242 గ్రాముల హెరాయిన్ , 35 కిలోల గసాగసల సామాగ్రి సీజ్ చేశారు. ఎక్సైజ్ యాక్ట్ కింద 656 కేసులు నమోదు , 689 మంది అరెస్ట్ , 6824 లీటర్ల మద్యం సీజ్ చేశారు
గేమింగ్ యాక్ట్ :- 227 కేసులు నమోదు , 1472 మంది అరెస్ట్ , 69 లక్షల ప్రాపర్టీ సీజ్
మానవ అక్రమా రవాణా :- ఈ ఏడాది 73 కేసులు నమోదు, 8 స్థావరాలు గుర్తింపు
జైలు శిక్షలు :- ఈ ఏడాది 5, 647 కేసుల్లో 146 మందికి జైలు శిక్ష ఖరారు. గత ఏడాది తో పోలిస్తే 74 % పెరిగిన కన్విక్షన్ రేటు
ఎస్ ఓటీ :- స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఈఏడాది 186 డ్రగ్స్ కేసుల్లో 356 మంది అరెస్ట్
సైబర్ క్రైమ్ :- గత ఏడాది తో పోలిస్తే తగ్గిన సైబర్ క్రైమ్ కేసులు
గత ఏడాది 4618 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3734 కేసులు నమోదయ్యాయి.
ఆపరేషన్ ముస్కాన్ కింద 2479 మంది ని రెస్క్యూ చేసిన పోలీసులు. ఆపరేషన్ స్మైల్ 1071 మంది రెస్క్యూ చేసిన పోలీసులు
రోడ్డు భద్రత :- గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య
గత ఏడాది 3207 కేసులు నమోదు కాగా, ఈఏడాది 3488 కేసులు నమోదు. రోడ్డు ప్రమాదాల్లో 659 మందిమృతి.. ORR పై జరిగిన ప్రమాదాల్లో 37 మంది మృతి చెందారని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 17 ,760 కేసులు నమోదు.. డ్రంక్ డ్రైవ్ ద్వారా 3.89 కోట్లు జరిమానాలు వసూలు.. 5821 లైసెన్స్ లు రద్దు అయినట్లు తెలిపారు.