Minister Errabelli Dayakar Rao Honored Chukka Ramaiah
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి శనివారం చుక్కా రామయ్యను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. అంతేకాకుండా.. చుక్కా రామయ్య ఆయన ఆరోగ్యంపై ఆరా తీసి.. ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడులను రామయ్యకు వివరించిన మంత్రి ఎర్రబెల్లి.. ఆయనకు పాదాభివందనం చేసి, ఆశీస్సులు తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ని, మంత్రి ఎర్రబెల్లిని అభినందించారు చుక్కా రామయ్య. ఇదిలా ఉంటే.. అంతకు ముందు.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని జెండావిష్కరణ చేశారు.