Photography, Men And Women Sitting Together Banned In Jamia Masjid Srinagar: ప్రసిద్ద శ్రీనగర్ జామియా మసీదు నిర్వాహకులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మసీదులో ఫోటోగ్రఫీతో పాటు స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడంపై నిషేధం విధించింది. దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అంజుమన్ ఆక్వాఫ్ సెంట్రల్ జామియా మీసీదు పేరుతో ఈ ఆదేశాలు జారీ చేసింది. స్త్రీ-పురుషులు మసీదు బయట లాన్ లో పచ్చిక బయళ్లలో కూర్చోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఫోటోగ్రాఫర్లు, కెమెరా పర్సన్లు మసీదు లోపల ఎలాంటి ఫోటోలు తీయకూడదని తెలిపింది. ఫోటోలు, వీడియో పరికరాలను మసీదులోకి అనుమతించమని.. గేట్ వద్దే ఆపేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: Pathaan: హిందుత్వాన్ని అవమానిస్తే సినిమాను అడ్డుకుంటాం.. “పఠాన్” మూవీకి బీజేపీ లీడర్ వార్నింగ్
మసీదు ఆవరణలో తినుబండారాలను కూడా తీసుకెళ్లడాన్ని నిషేధించింది. మసీదు లోపల మధ్యహ్న భోజనం, ఎలాంటి తినుబండారాలను తీసుకురావడానికి అనుమతి లేదని.. కాబట్టి సందర్శకులను గేటు వద్దే ఆపేయాలని ఆదేశించింది. 14 వ శతాబ్ధానికి చెందిన కాశ్మీర్లోని జామియా మసీదు చాలా ప్రసిద్ధమైంది. వెంటనే ఈ సూచనలను భద్రతా సిబ్బంది అమలు చేయాలని మసీదు నిర్వహకులు భద్రతా సిబ్బందిని కోరారు. అయితే స్త్రీలు మసీదులోకి పురుషుల నుంచి దూరంగా ఉండేలా చూసుకోవాలని.. అలా అయితే మసీదులోకి రావచ్చని తెలిపింది.