కేరళ నరబలి కేసులో ముగ్గురు నిందితులను తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు మహ్మద్ షఫీ, భగవల్ సింగ్, లైలాలను పోలీసు కస్టడీకి పంపింది.
కేరళలో సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళల నరబలి కేసులో ముగ్గురు నిందితులకు స్థానిక న్యాయస్థానం 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో విచారణ చేపట్టగా.. వెన్నులో వణుకు పుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.