Haryana-Punjab: శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని కోర్టు ఆదేశం..
- నూతన రైతు చట్టాలను వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఢిల్లీకి మార్చ్ ప్రకటించిన రైతు సంఘాలు
- పంజాబ్- హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్లతో మూసిన ప్రభుత్వం
- రైతులను అక్కడే అడ్డుకున్న పోలీసులు
- ఆ సరిహద్దును వారంలోపు తెరవాలని హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రవేశ పెట్టిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 10, 2024న.. కొన్ని రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్‌ని ప్రకటించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్ల సహాయంతో మూసివేసింది. రైతులను హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఆ సరిహద్దు మూతపడి ఉంది. కాగా.. ఈ సరిహద్దును తెరవాలని చాలా మంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా హర్యానా-పంజాబ్ హైకోర్టు ఈ సరిహద్దుపై తన తీర్పును ఇచ్చింది. శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని పేర్కొంది. శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను 7 రోజుల్లోగా తొలగించాలని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
READ MORE: Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..
Also Read
సరిహద్దుపై దాఖలైన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాసు రంజన్ శాండిల్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా కాలం క్రితమే సరిహద్దును తెరవాలని తమ తరపున పిటిషన్ దాఖలయ్యిందన్నారు. అందులో మూసివేతకు కారణమేమిటని పేర్కొన్నారు. శంభు సరిహద్దు కావడంతో అంబాలా వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూశారని.. పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కోర్టు తీర్పుతో పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ వ్యాపారులకు మళ్లీ కొత్త జీవితం లభించినట్లయ్యిందని వెల్లడించారు. “గతంతో పోలిస్తే పరిస్థితి చాలా మారిపోయింది. ఇప్పుడు ఆందోళనకారుల సంఖ్య కూడా తగ్గింది. పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలి. రైతులను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది.” అని కోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. పంజాబ్ మరియు హర్యానా కూడా శాంతిభద్రతలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!