భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్ కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 8,31,300కు పెరిగింది. కాగా వైరస్ సోకిన వారిలో 4,42,83,021 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.
Also Read : Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఎందుకు కొనాలి..? ఏమిటా కథ..
శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కొనసాగించాలన్నారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఉంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Also Read : Mamata Banerjee: రాజ్యాంగాన్ని.. చరిత్రను మార్చే కుట్ర జరుగుతోంది..
కొవిడ్ మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు.. వైరస్ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ రాష్ట్రాలకు లేఖ రాశాడు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ. అధిక సంఖ్యలో కేసుల నమోదు స్థానికంగా వైరస్ వ్యాప్తిని సూచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ దశలోనే దీన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్యా ఆరోగ్యశాఖ సూచించింది. ప్రజలందరు మాస్కులు ధరించాలని సూచించారు.. ఆస్పత్రుల్లో సరైన వసతులతో పాటు ఆక్సిజన్ నిల్వలను సైతం అందుబాటులో ఉంచుకోవాలని వెల్లడించింది.