రాజోలు జనసేన అభ్యర్థిత్వంపై వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో.. బొంతు రాజేశ్వరరావు వర్గం రోడ్డెక్కింది. జనసేన అభ్యర్థిత్వంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. బొంతు, దేవా వర్గాలు సీటు తమదంటే తమదంటూ పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. మలికిపురంలో బొంతు రాజేశ్వరరావు ఇంటి నుంచి ఆయన వర్గం మలికిపురం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.
TS Electinos 2024: తెలంగాణలో మే 13న ఎన్నికలు..
స్థానికులకే టికెట్ కేటాయించాలని.. గో బ్యాక్ దేవా, దేవా వద్దు బొంతే ముద్దు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఫలితాలు పునరావృతం కాకుండా జనసేన అధిష్టానం పటిష్టమైన నిర్ణయం తీసుకోవాలని బొంతు వర్గం తెలుపుతుంది. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా సీటు కేటాయించాలని, అవసరమైతే సొంత డబ్బులు ఖర్చు చేసి గెలిపించుకుంటామని బొంతు వర్గం తెలుపుతుంది. మరోవైపు.. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కొందరికి టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో.. ఆశవాహులను పార్టీ అధినేతలు బుజ్జగించే పనిలో పడ్డారు.