NTV Telugu Site icon

IPL 2025-RCB: ఐపీఎల్ ప్రారంభం కాకముందే వివాదాల్లో చిక్కుకున్న ఆర్‌సీబీ..

Ipl 2025 Rcb

Ipl 2025 Rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. మెగా వేలంలో 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆర్‌సీబీ ఐపీఎల్ కి ముందే ఓ వివాదంలో చిక్కుకుంది.

READ MORE: Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది.. మంత్రి సీతక్క సంచలన కామెంట్..

మెగా వేలంలో ఆర్‌సీబీ జట్టు వివాదాల్లోకి వచ్చింది. వాస్తవానికి.. ఈ టీమ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ (X)లో హిందీలో తన ఖాతాను సృష్టించింది. దీని కారణంగా కన్నడ మాట్లాడే అభిమానులలో ఆగ్రహం పెరిగింది. అక్టోబర్ 2024లో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా ఖాతాలో ఐదు ట్వీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఎక్స్ ఖాతాలో ఆర్‌సీబీకి దాదాపు 2,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక కన్నడ అనుకూల సంఘాలు, అభిమానులు ఈ చర్యను విమర్శించారు. కన్నడ మాట్లాడే అభిమానులపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించారు. చాలా మంది సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్‌ను కూడా ప్రారంభించారు.

READ MORE:PM Modi- Jaishankar: బంగ్లాదేశ్‌లో హైటెన్షన్.. ప్రధాని మోడీతో జై శంకర్ కీలక భేటీ

అంతే కాకుండా ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ ఏఐ వీడియోను కూడా ఆర్‌సీబీ ఈ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ హిందీలో అభిమానులను పలకరిస్తన్నట్లు కనిపిస్తాడు. కాగా.. ఆర్‌సీబీ ప్రధాన కార్యాలయం బెంగళూరులోనే ఉన్న విషయం తెలిసిందే.