Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు. పలు సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Mukesh Ambani-Trump: ఖతార్‌లో భేటీకానున్న ట్రంప్-ముఖేష్ అంబానీ