Ranjith Reddy: సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఫైరయ్యారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, తనకు చేవెళ్ళలో పోటీ ఉంటుందని.. తాను బాధ్యతాయుతమైన నేత అని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. బాలాపూర్, బడంగ్పేట్, సరూర్‌నగర్ సీఎం రేవంత్ రోడ్ షోలో రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏనాడైనా కొండా చేవెళ్ళ ప్రజలతో కలిశారా? వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారా? అని ప్రశ్నించారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ జై కొడుతోందని.. ఎందుకంటే, ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగింటిని స్థానిక సర్కారు అమలు చేసిందన్నారు.
Actor Jai: అంజలితో ప్రేమాయణం.. మరో హీరోయిన్ ను పెళ్లాడిన హీరో?
Also Read
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నామని రంజిత్ రెడ్డి వివరించారు. సీఎం రేవంత్ నాయకత్వంలో తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీలే తమకు పంచ ప్రాణాలన్నారు. బీజేపీ మాత్రం సంక్షేమ పథకాలు మొత్తం తీసేస్తామని చెబుతోందని.. అందుకే, ఈ ఎన్నికలు పేదల సంక్షేమం వర్సెస్ నో సంక్షేమం అంటూ రంజిత్ రెడ్డి నొక్కి చెప్పారు. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ నో రిజర్వేషన్లు అని స్పష్టం చేశారు. తన పోరు కొండా విశ్వేశ్వరరెడ్డితోనేనని.. ఆయన ఒక పొలిటికల్ టూరిస్టు అంటూ ఎద్దేవా చేశారు. ఈ పొలిటికల్ టూరిస్టు ఐదేండ్లు చేవెళ్ళలో కనబడలేదన్నారు. కరోనా సమయంలో ఆయన శానిటైజర్ పూసుకుని ఇంట్లో కూర్చుండని విమర్శించారు.
Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు?
కొండా విశ్వేశ్వర్ రెడ్డి… ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నావు కదా…? ఏ గ్రామంలోనైనా తన గురించి అడగాలని, తాను చేసిన సేవల గురించి ప్రజలను అడగాలని హితవు పలికారు. వారే ఆయనకు సమాధానం చెబుతారన్నారు. తన మీద కొండా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఎన్నోసార్లు సవాల్ విసిరానని, ఏ చౌరస్తాకొస్తావా? ఈ చౌరస్తాకొస్తావా? అని నిలదీశానన్నారు. కానీ ఇప్పటివరకూ సమాధానం లేదన్నారు. చెయ్యి గుర్తుకు ఓటేసి.. తనను ఎంపీగా గెలిపిస్తే, సీఎం రేవంత్‌కు అదనపు బలం వస్తుందన్నారు. దాంతో కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తారని, చేవెళ్లను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్నారు.
తాజావార్తలు
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!