Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
- 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు ఎంఎంకే డిమాండ్..
- ఖైదీల్లో కోయంబత్తూర్ పేలుళ్ల ఖైదీలు కూడా..
- తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ నిరసన ప్రదర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Protest: జీవిత ఖైదు అనుభవిస్తున్న 22 మంది ముస్లిం ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు రాజధాని చెన్నైలో మనితనేయ మక్కల్ కట్చి(MMK) భారీ నిరసన ర్యాలీని నిర్వహించింది. దీంతో పాటు ముస్లిం మతంలోకి వెనుకబడిన తరగతుల (BC), అత్యంత వెనుకబడిన తరగతుల (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలకు చెందిన వారికి గతంలో అమలైన 3.5 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ ర్యాలీలో 10,000 మంది పాల్గొన్నారు.
విడుదల చేయాలని కోరుతున్న ఖైదీల్లో 1998 కోయంబత్తూర్ వరస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు పడిన 14 మంది కూడా ఉన్నారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీ టార్గెట్‌గా ఈ దాడికి పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో శిక్ష పడినవారు గత 28 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు. ఉగ్రవాద దాడికి పాల్పడిన నేరస్తుల్ని విడుదల చేయాలనే డిమాండ్‌పై విమర్శలు వస్తున్న వేళ.. MMK అధినేత డాక్టర్ ఎం.హెచ్. జవాహిరుల్లా మాట్లాడుతూ.. ఆ ఖైదీల జీవితం మొత్తం జైలులోనే గడిచిందని, గతంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, ఒక కమిషన్ సిఫారసు మేరకు ఇతర మతాలకు చెందిన వారితో పాటు ఇలాంటి కేసుల్లో ఉన్న 41 మందిని విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు.
Also Read
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
- UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
- Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
- Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
MMK ప్రస్తుతం డీఎంకేకు మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సహా గతంలో డీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు టీవీకే వైపు వెళ్లినప్పటికీ, MMK మాత్రం డీఎంకేతోనే కొనసాగుతోంది. తమ డిమాండ్లపై విజయ్ సర్కార్ చర్యలు తీసుకోవాని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్‌తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..