Chess World Cup Prize Money: చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఇండియన్ చెస్ సెన్సేషన్ ప్రజ్ఞానంద నిన్న జరిగిన ఆటలో ఓటమి పాలైయ్యారు.. అందరు విన్నర్ అవుతాడని అనుకున్నారు.. కానీ చివరి నిమిషంలో తడబడటంతో విన్నర్ స్థానాన్ని అందుకోలేక పోయాడు.. ప్రస్తుతం ఇతను రన్నర్ గా నిలిచాడు.. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ పై ఆసక్తి నెలకొంది.. విన్నర్ కు ఎంత ప్రైజ్ మని ఇస్తారు.. రన్నర్ కు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారని జనాలు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..
భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద్, కార్ల్‌సన్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో మంగళ, బుధవారాల్లో వరుసగా రెండు రోజులు డ్రాగా ముగిశాయి. విజేత కోసం గురువారం స్వల్పకాలిక టై బ్రేక్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 1 చెస్ స్టార్ పోటీని అన్ని విధాలుగా అందించడంలో ప్రజ్ఞానంద సఫలమయ్యాడు. అయితే టైబ్రేక్‌లో విజయం సాధించి కార్ల్‌సన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.. ప్రపంచకప్ గెలిచిన నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సెన్ విన్నర్ గా నిలిచాడు..
నిజానికి ఈ చెస్ వరల్డ్ కప్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ రూపంలో భారీ మొత్తం అందనుంది. విజేతకు 1.1 లక్షల డాలర్లు (సుమారు రూ.90.93 లక్షలు), రన్నరప్ కు 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుతాయి. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.15.13 కోట్లు. ఈ వరల్డ్ కప్ టైటిల్ కోసం 32 ఏళ్ల కార్ల్‌సన్, 18 ఏళ్ల ప్రజ్ఞానంద తలపడ్డారు.. ప్రజ్ఞానంద రన్నారుగా నిలిచాడు.. అంటే అతను 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు)అందుకోనున్నాడు.. అతి చిన్న వయస్సులో ఆ స్థానాన్ని అందుకోవడం పై అతనిపై దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. అన్నీ దేశాలను వెనక్కి నెట్టి ఫైనల్ వరకు రావడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు..