మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో విచ్చల విడిగా డబ్బు, మధ్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. చౌటుప్పల్ లో డబ్బు పంపిణీ విపరీతంగా పంపిణీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంను బీజేపీ కూని చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద బీజేపీ మత, కుల రాజకీయాలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా.. బీజేపీ పైసలు పంచుకుంటు మా పై ఆరోపణ చేస్తుందని, మోడీ, అమిత్ షా కుట్ర చేసి ఈ ఎన్నిక తెచ్చారన్నారు.
Also Read : Munugode Bypoll : మధ్యాహ్నం 3గంటల వరకు 59.92 శాతం పోలింగ్
మునుగోడులో 15 బలగాలు పెట్టీ రణరంగం అయినట్టు బీజేపీ సృష్టిస్తుందని, రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ స్థాయిలో ధర్నా చేసి.. హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో సంజయ్ ధర్నా చేసి మునుగోడులో అటెన్షన్ డైవర్షన్ చేసి మునుగోడులో అల్ల కల్లోల్లం సృష్టించారని ఆయన విమర్శించారు. కేసిఆర్ పాలన కావాలని జనాలు కోరుకుంటున్నారన్న లింగయ్య యాదవ్.. బీజేపీకి కేసీఆర్ అంటే భయం పుడుతుందన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాలలో వస్తే ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ ఎన్నికతో ఇక్కడే ఆపాలని చూస్తున్నారు అది ఎవరి తరం కాదని, మునుగోడులో జరుగుతున్న అరాచకాలు ఆపాలని వికాస్ రాజ్ ను కోరామన్నారు.