Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Congress Leaders Comments On Brs And Bjp

Balaram Naik : వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం

Published Date :August 13, 2023 , 3:16 pm
By Gogikar Sai Krishna
Balaram Naik : వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

గాంధీ భవన్ లో ఆదివాసీ సభ నిర్వహించారు. ఈ సభకు ఇంఛార్జి మాణిక్‌ రావు థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాం నాయక్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని, వ్యవసాయం చేసే ప్రతీ గిరిజన రైతుకు అన్ని రకాల సబ్సిడీ లు ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గిరిజనుల ఎదుగుదలకు కృషి చేసింది కాంగ్రెస్ మాత్రమేనని, కాంగ్రెస్ ను గెలిపిస్తేనే గిరిజనులకు భవిష్యత్ అని ఆయన అన్నారు. 70 నియోజకవర్గాల్లో ఎస్టీలు గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తారని, ప్రతీ ఎస్టీ కాంగ్రెస్ జెండా మోయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఛైర్మన్ శివాజీ రావ్ మోగే మాట్లాడుతూ.. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడానికి ఆదివాసిలే కారణమని, బీఆర్ఎస్ ఆదివాసీలకు చేసింది ఏమి లేదన్నారు.

Also Read : Elon Musk: కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. ఫోటో షేర్ చేసిన మస్క్

ఆది వాసీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఆదివాసీ లు అంటే గాంధీ కుంటుంబానికి ప్రేమ ఉందని, ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఫారెస్ట్ రైట్స్ ఆక్ట్ ఆదివాసీల రక్షణ కోసమే కాంగ్రెస్ తీసుకొచ్చిందని, బీజేపీ పేదల వ్యతిరేకి పార్టీ అని ఆయన మండిపడ్డారు. మణిపూర్ లో గిరిజనులకు మద్దతు నిలిచింది కాంగ్రెస్సే అని, క్రిస్టియన్, ముస్లిం, ఆదివాసీ లు అంటే బీజేపీ నేతలకు నచ్చరన్నారు. తెలంగాణ లో కూడా జనరల్ సీట్ల లో ఎస్టీ లకు టిక్కెట్ లు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పార్లమెంట్ స్థానాల్లో కూడా మాకు ఓపెన్ కేటగిరీ లో టిక్కెట్ లు కావాలన్నారు. అనంతరం.. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీ మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లోను ఆదివాసీ గిరిజన నాయకులకు సమూచిత స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆదివాసీల పాత్ర కీలకంగా ఉండనుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా సమిష్టిగా పాటుపడాలన్నారు.

Also Read : IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ ఐదో టీ20.. డ్రీమ్ 11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • bjp
  • breaking news
  • BRS
  • congress

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions