గాంధీ భవన్ లో ఆదివాసీ సభ నిర్వహించారు. ఈ సభకు ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని, వ్యవసాయం చేసే ప్రతీ గిరిజన రైతుకు అన్ని రకాల సబ్సిడీ లు ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గిరిజనుల ఎదుగుదలకు కృషి చేసింది కాంగ్రెస్ మాత్రమేనని, కాంగ్రెస్ ను గెలిపిస్తేనే గిరిజనులకు భవిష్యత్ అని ఆయన అన్నారు. 70 నియోజకవర్గాల్లో ఎస్టీలు గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తారని, ప్రతీ ఎస్టీ కాంగ్రెస్ జెండా మోయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఛైర్మన్ శివాజీ రావ్ మోగే మాట్లాడుతూ.. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడానికి ఆదివాసిలే కారణమని, బీఆర్ఎస్ ఆదివాసీలకు చేసింది ఏమి లేదన్నారు.
Also Read : Elon Musk: కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. ఫోటో షేర్ చేసిన మస్క్
ఆది వాసీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఆదివాసీ లు అంటే గాంధీ కుంటుంబానికి ప్రేమ ఉందని, ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఫారెస్ట్ రైట్స్ ఆక్ట్ ఆదివాసీల రక్షణ కోసమే కాంగ్రెస్ తీసుకొచ్చిందని, బీజేపీ పేదల వ్యతిరేకి పార్టీ అని ఆయన మండిపడ్డారు. మణిపూర్ లో గిరిజనులకు మద్దతు నిలిచింది కాంగ్రెస్సే అని, క్రిస్టియన్, ముస్లిం, ఆదివాసీ లు అంటే బీజేపీ నేతలకు నచ్చరన్నారు. తెలంగాణ లో కూడా జనరల్ సీట్ల లో ఎస్టీ లకు టిక్కెట్ లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్థానాల్లో కూడా మాకు ఓపెన్ కేటగిరీ లో టిక్కెట్ లు కావాలన్నారు. అనంతరం.. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీ మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లోను ఆదివాసీ గిరిజన నాయకులకు సమూచిత స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆదివాసీల పాత్ర కీలకంగా ఉండనుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా సమిష్టిగా పాటుపడాలన్నారు.
