హైదరాబాద్ లో ‘రైతే రాజైతే…’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని సంయుక్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరా రెడ్డిలు సంయుక్తంగా రాశారు. అయితే, ‘రైతే రాజైతే’ పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు. తొలి పుస్తకాన్ని సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీపీఐ నారాయణ, మాజీ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు, వైఎస్సార్ సన్నిహితులు, అభిమానులు హాజరైనారు.
Read Also: CPI Narayana: రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి..
ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు నేను ఏఐసీసీ ఇంచార్జ్ గా ఉన్నాను.. అప్పుడది ఛాలెంజింగ్ టాస్క్ అంటూ ఆయన వ్యాఖ్యనించారు. కేవీపి.. వైఎస్సార్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు.. యువతకు.. మహిళల కోసం ఉపయోగపడ్డాయి.. రెండు రూపాయలకు కిలో బియ్యం, మైనారిటీ రిజర్వేషన్, ఫీజ్ రీయంబర్మెంట్స్ ఇచ్చారు అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
Read Also: Abhishek Banerjee: కూటమి ప్రభుత్వం ఏర్పడితే గ్యాస్ సిలిండర్ ధర రూ.500 తగ్గిస్తాం
కరువు ప్రాంతాలుగా ఉన్న వాటిని జలయజ్ఞంతో బాగు చేశారు.. ఇది ఆయన విజన్ కు నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. వైఎస్సార్ పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు.. అందరి వాడు.. ఒక స్ట్రాటజిస్ట్.. పాలిటిక్స్ ని, పథకాలను మెయింటైన్ చేయడం ఒక ఆర్ట్.. కాంగ్రెస్ పడిపోతున్న సమయంలో పాదయాత్రతో అధికారంలోకి తెచ్చారు.. కాంగ్రెస్ పెద్దల పాలసీలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాడు.. మంచి చేశాడు.. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉంటె దేశంలోని సమస్యల కోసం పోరాడేవాడు అంటూ దిగ్గిరాజా పేర్కొన్నాడు.