Mahabubabad: ఓ కుటుంబంలో కవల పిల్లలు జన్మించారు. అయితే వారిద్దరికి సాకే స్థామత లేక మరొక దంపతులకు ఆస్పత్రిలోనే దానం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ దానం ఇచ్చిన పసికందు కావాలంటూ పోలీస్టేషన్ మెట్లు ఎక్కారు. అయితే మీరు కని మాకు ఇచ్చినప్పటి నుంచి మేము చిన్నారిని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటున్నామని పెంచుకుంటున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు దానం ఇచ్చిన చిన్నారిని ఎందుకు మళ్లీ అడుగుతున్నారు? అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది.
దానికి కారణం కవలలు జన్మించిన ఇద్దరిలో ఒకరికి దానం ఇచ్చి మరొకరిని వారిదగ్గర పెంచుకున్నారు. అయితే కొద్దిరోజుల క్రింతం కొందరు కవలలను విడదీయకూడంటూ చెప్పడంతో దీంతో దానం చేసిన చిన్నారిపై కన్న ప్రేమ చిగురించింది. దీంతో ఇప్పుడు దానం చేసిన కూతురు కావాలంటూ పెంచిన తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచారు. వారు స్పందించక పోవడంతో ఆ చిన్నారిని కన్న తల్లిదండ్రులు పోలీస్టేషన్ కు ఆశ్రయించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన వీరన్న స్వరూప దంపతులు.. నాలుగు సంవత్సరాల క్రితం తొర్రూర్ పట్టణంలోని అమ్మ ఆస్పటల్ లో డెలివరీ కోసం వచ్చి ఇద్దరు ఆడ కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు కవలలు కావడంతో పక్క బెడ్ లో ఉన్న ఓ దంపతులు పురిటిలోనే పాపను కోల్పోయి బాధతో ఉన్న వారికి ఆడ శిశు వులకు జన్మనిచ్చిన తల్లి కనిపించింది. దీంతో ఒక పాప మాకు కావాలని చెప్పడంతో అంగీకరించిన వీరన్న,స్వరూప దంపతులు ఇద్దరు ఆడ శిశువులను సాధలేక ఒక ఆడ శిష్యుని ఇచ్చారు.
అంతా బాగానే సాగుతున్న సమయంలో ఈమధ్య కాలంలో ఆడ కవలలను విడదీయవద్దు అంటూ ఎవరో చెప్పడంతో తమ పాప కోసం గతంలో తీసుకుపోయిన దంపతుల కోసం వెతికారు. వాళ్ళ ఆచుకి తెలుసుకుని ఫోన్ చేసి మా పాప మాకు కావాలని అడగడం మొదలుపెట్టారు. ఆ దంపతులు పాపనియ్యడానికి నిరాకరించి అలా ఎలా ఇస్తాం మని పెంచుకున్న తల్లి తండ్రులు చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టారు. దీంతో తమ పాపను తమకు ఇప్పించాలంటూ పోలీస్ స్టేషన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు కన్న తల్లిదండ్రులు. ఇటు పెంచిన ప్రేమ, అటు కన్న మమకారం మధ్యలో ఎవరికి చెప్పాలో తెలియక పోలీసులు సతమతమవుతున్నారు.
Redmi Note 13 Pro: సరికొత్త కలర్‌లో ‘రెడ్‌మీ నోట్ 13 ప్రో’.. ధర ఎంతంటే?