తాటిచెట్ల నుంచి తీసినదాన్ని తాటికల్లు అంటారు. ఈత చెట్ల నుంచి తీసిన దాన్ని ఈత కల్లు అంటారు. కల్లులో 15 రోగాలను తగ్గించే ఔషధ గుణాలున్నట్లు తేలడంతో బెంజి కార్లలో తిరిగేవారు కూడా వచ్చి స్వయంగా కల్లు తాగుతున్నారు.

కల్లులో క్యాన్సర్ ను నాశనం చేసే గుణం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.  ఈత చెట్లకు ఉండే మట్టలను నాలుగైదుసార్లు చెక్కడంద్వారా వాటి నుంచి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. 

ఈత చెట్ల లోపలి మట్టను చెక్కుతారు. వారంరోజులపాటు దాన్ని అలాగే వదిలిపెడతారు. వారంరోజులు ముగిసిన తర్వాత మరోసారి చెక్కుతారు. అప్పటి నుంచి కుండలోకి కల్లు కారుతూ ఉంటుంది. 

మట్టలకు కట్టిన కుండను మూడురోజులుంచి తర్వాత తీసేస్తారు. అప్పటికే ముందుగా కారిపోయిన కల్లు పులిసిపోయి ఉంటుంది. కారిన కల్లుతో కలిసి తాజాగా వచ్చిన కల్లు మరింత నిషా ఇచ్చేదిగా మారుతుంది. 

తాటికల్లును కూడా ఇదే పద్ధతిలో సేకరిస్తారు. కాకపోతే ఈరోజు కట్టిన కుండను తర్వాత రోజు తీసేస్తారు. నిల్వ ఉన్న కల్లు తాగడం చాలా తక్కువ. ఈత చెట్ల నుంచి తీసిందైతే అది అప్పటికే చెట్టుమీదే 7 నుంచి 10 రోజులపాటు ఉండిపోతుంది. 

ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున 40 రోజులపాటు తీసుకుంటే శరీరంలో రక్తం మొత్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే లవణాలు, ఖనిజాలు, విటమిన్లు ఎంతో మేలు చేస్తాయని పూర్వీకులు చెబుతుంటారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కల్లును ఔషధంగా భావిస్తారు. కల్లునిచ్చే చెట్లను కల్పవృక్షాలుగా కొలుస్తారు. ఈతకాయలు తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుందని తేలింది. 

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఈతకాయలకు ఉంది. కల్లులో శరీరానికి మేలు చేసే 18 రకాల సూక్ష్మక్రిములున్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

జీర్ణవ్యవస్థను బాగుచేయడంలో దీనిపాత్ర అమూల్యం. మ‌న‌లో చాలా మంది తాటి క‌ల్లును సేవిస్తూ ఉంటారు.  మాంసాహారాలు, జంక్ ఫుడ్, మసాలా వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్థమైన మనిషి జీర్ణాశయ వ్యవస్థను కల్లు ఎంతగానో దోహదపడుతుందని తెలుపుతున్నారు. 

తాటి క‌ల్లును పరగడుపునే తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోయి శరీరం అంతర్గతం శుభ్రపడుతుంది.